Home ఎంటర్‌టెయిన్మెంట్ రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! – VRM MEDIA

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! – VRM MEDIA

by VRM Media
0 comments
రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా!




-రాజా సాబ్ విషయంలో ఏం జరుగుతుంది
-రిజల్ట్ పరిస్థితి ఏంటి!
-సీక్వెల్ లో చెప్పబోతున్న కథ ఏంటి
-అసలు సీక్వెల్ ఉంటుందా

పాన్ ఇండియా ప్రభాస్(ప్రభాస్)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని థియేటర్ రెబల్ మూవీ ‘ది రాజాసాబ్'(ది రాజా సాబ్)నిన్న బెనిఫిట్ షోస్ తో ల్యాండ్ అయ్యింది. దీనితో థియేటర్లు అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్‌కి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్సిడ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.

రాజాసాబ్ మూవీ చివర్లో సర్కస్ ట్రైనర్ గా ముఖానికి విభిన్న రంగులని పూసుకొని ఒక ప్రభాస్ చాలా కోపంగా రాజా గా చేసిన మరో ప్రభాస్ ని చూస్తాడు. ఆ రాజా సాబ్ కి సీక్వెల్ ఉన్నట్టుగా ది రాజాసాబ్ 2 :సర్కస్ 1935 ‘అనే టైటిల్ ని మేకర్స్ ప్రదర్శించడం జరిగింది. దీంతో ఇద్దరు ప్రభాస్ లతో రాజాసాబ్ సీక్వెల్ ప్రదర్శించడం ఖాయమయ్యి ఒకరు ప్రతినాయకుడిగా ఉంటే అభిమానులకి మరో పండుగ వచ్చినట్టే అనే మాటలు సోషల్ మీడియా వేదికగా వినబడుతున్నాయి.

రాజాసాబ్ ని మారుతీ(మారుతి)దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(people Media factory)సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ జతకట్టగా థమన్ మ్యూజిక్ అందించాడు. తాత ప్రభాస్ గా సంజయ్ దత్, నాయనమ్మ గా జరీనా వాహెబ్ కనిపించారు.

2,807 Views

You may also like

Leave a Comment