Home Uncategorized ఒంటిమిట్ట రెవెన్యూ కార్యాలయంలో ACB వలలో చిక్కిన చిన్న చేప

ఒంటిమిట్ట రెవెన్యూ కార్యాలయంలో ACB వలలో చిక్కిన చిన్న చేప

by VRM Media
0 comments

15000 వేలు లంచంతీసుకుంటూ ACB కి రెడ్ హ్యాండెడ్ గా ప ట్టుబడ్డ VRO. శ్రీనివాసులు

VRM న్యూస్ బాల మౌలాలి జనవరి 9

ఏసీబీ వలలో కోనరాజుపల్లె
వి ఆర్ ఓ శ్రీనివాసులు
15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
అవినీతి నిరోధక శాఖ పన్నిన వలలో ఒంటిమిట్ట మండలం కోనరాజుపల్లె విఆర్ఓ శ్రీనివాసులు 15 మేల రూపాయలు లంచం తీసుకుంటూ శుక్రవారం మధ్యాహ్నం పట్టుబడ్డాడు కడప అవినీతి నిరోధక శాఖ డిఎస్పి సీతారామారావ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోనరాజు పల్లి కి చెందిన రాజారెడ్డి అతని సోదరుడు రమణారెడ్డిలో వ్యవసాయ పంపు సెట్టు సంబంధించి బోరు వేయడానికి వాల్టా చట్టం ప్రకారం తమ పొలం భూమిలోని సర్వేనెంబర్ 195, 201 కుఎన్ ఓ సి కోసం స్థానిక తాహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఎన్ఓసి సర్టిఫికెట్ రిపోర్టు తయారుచేసి తనకు పంపాలని వీఆర్వో నుతాహసిల్దార్ ఆదేశించారు. అయితే ఎన్ఓసి సర్టిఫికెట్ కావాలంటే తనకు ఇద్దరు రైతులు ఒక్కొక్కరు 9 వేల రూపాయల చొప్పున 18 వేల రూపాయలు చలానా 4 పేల రూపాయలు ఓ లంచం ఇవ్వాలని వీఆర్వోడిమాండ్ చేశాడు .లంచం ఇవ్వడం ఇష్టం లేని రాజారెడ్డి అనే రైతు కడప ఏసీబీ కార్యాలయంలో సంప్రదించాడు. ఏసీబీ సూచన మేరకు 16,000 లంచం 4000 రూపాయలు చలానా ఇస్తారని రైతు విఆర్ఓ తో ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఏసీబీ వారు ఇచ్చిన 15 వేల రూపాయలు తాహసిల్దార్ కార్యాలయం వెనుకవైపున రాజా రెడ్డి అనే రైతు నుండి విఆర్ఓ శ్రీనివాసులు 15 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఈ మేరకు నగదు విఆర్ఓ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి కర్నూల్ ఏసీబీ కోర్టులో హాజరు పడుతున్నట్లు డి.ఎస్.పి తెలిపారు. ఈ కేసులో ఇంకా ఇతర అధికారుల ప్రమేయం ఉందా అనే విషయం దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు..ప్రభుత్వ అధికారులు ప్రజల పనిచేయడం విధి అని దాన్ని అధికారులు లంచం డిమాండ్ చేస్తే అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని ఆయన కోరారు.కడప అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే 9440446191 తన ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని డిఎస్పి ప్రజలను కోరారు

2,830 Views

You may also like

Leave a Comment