Home Uncategorized సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తోన్న చిల్ల కాలువ దిశ మార్చండి.

సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తోన్న చిల్ల కాలువ దిశ మార్చండి.

by VRM Media
0 comments
  • సంబంధిత అధికారులకి తోగ్గూడెం, సత్యం పేట, రంగాపురం గ్రామస్థుల వినతి.
  • కనుమరుగు అవనున్న ప్రభుత్వ పాఠశాల, మరియు నిరు పేదల ఇళ్ళు,పొలాలు
  • అధికారులకి వినతి పత్రాలిచ్చేందుకు సిద్దమౌతోన్న ఆయా గ్రామాల ప్రజలు.

VRM మీడియా
సత్తుపల్లి ప్రతినిధి నక్కాలక్ష్మయ్య

తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్మిస్తోన్న, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కాలువకు అనుసంధానముగా ఏర్పాటు చేస్తున్న కాలువ(చిల్ల కాలువ ) సత్తుపల్లి మండల పరిధిలోని
తోగ్గూడెం గ్రామంలోని ప్రభుత్వ యూపిఎస్ పాఠశాలను ఆనుకొని 100 మీటర్ల దూరంలో నిర్మాణం జరుగుతోందని దీంతో పాఠశాలలో చదువుకునే విద్యార్థులు, వృద్దులు, పశువులు అనేక ప్రమాధాలకు గురయ్యే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతగా కాకుంటే కాలువ దిశ మార్చి గ్రామాల సమీపాన సహజ సిద్ధంగా ప్రవహిస్తోన్న వాగు కాకర్లపల్లి చెరువులో కలిసే వాగుకు అనుసంధానం చేస్తే ఆయా గ్రామ ప్రజలకు క్షేమదాయకంగా ఉంటోందని గ్రామస్థులు వాపోతున్నారు.

2,813 Views

You may also like

Leave a Comment