కొణిజర్ల మండలం పెద్దగోపతి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈరోజు కళాజాత ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దగోపతి బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ పిఎంజెజెవై, పీఎంఎస్బివై , ఏపీవై, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇన్సూరెన్స్ స్కీములను బ్యాంకు ఖాతాదారులు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన ఖాతాదారులకు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలను అందరూ వినియోగించుకొని లబ్ధి పొందాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది మరియు బ్యాంకు మిత్ర అశ్విని, ఖాతాదారులు పాల్గొన్నారు.