Home ఎంటర్‌టెయిన్మెంట్ ఇది నా స్టామినా.. కలెక్షన్ రికార్డులు వసూలు – VRM MEDIA

ఇది నా స్టామినా.. కలెక్షన్ రికార్డులు వసూలు – VRM MEDIA

by VRM Media
0 comments
ఇది నా స్టామినా.. కలెక్షన్ రికార్డులు వసూలు




-రాజాసాబ్ కలెక్షన్స్ నిజమేనా
-పీపుల్ మీడియా ఫ్యాక్టర్ ఏం చెప్తుంది
-ప్రభాస్ స్టామినా మరో సాటి తెలిసిందా!
-మన శంకర వరప్రసాద్ ప్రసాద్ గారు ప్రభావం ఎంత!

రెబల్ సాబ్ ప్రభాస్(ప్రభాస్)’ది రాజాసాబ్'(ది రాజా సాబ్)తో వరల్డ్ వైడ్ గా తొమ్మిదవ తారీఖున అడుగుపెట్టిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలవ్వగా ఆ అంచనాలని అందుకోవడంలో రాజా సాబ్ విఫలమయ్యాడనే అభిప్రాయాన్ని ప్రీమియర్స్ నుంచే మెజారిటీ అభిమానులు, ప్రేక్షకులు వ్యక్తం చేశారు. దీని ప్రకారం సుమారు 30 కోట్ల రూపాయలకు పైన బడ్జెట్ తో తెరకెక్కిన రాజాసాబ్ ఏ మేర కలెక్షన్స్ సాధిస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ఈ మూడు రోజుల వరకు రాజసాబ్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ వివరాలు చూద్దాం.

రాజాసాబ్ మూడు రోజులకి వరల్డ్ వైడ్ గా 183 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాడు. ఈ మేరకు రాజాసాబ్ ని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారంగా వెల్లడి చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో పండుగ ట్రీట్ బాక్స్ ఆఫీస్ కార్నేజ్ గా మారింది”అనే వర్డ్ ని కూడా ఉంచడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కలెక్షన్స్ సాధించడంతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ సత్తా చాటినట్లయిందనే మాటలు కూడా సినీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.


ఇది కూడా చదవండి: తీసుకున్న రెమ్యునరేషన్స్ ఇవేనా!. ప్రస్తుత టాక్ ఎలా ఉంది

ఇక ఈ రోజు విడుదలైన మెగాస్టార్, విక్టరీ ల మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో రాజాసాబ్ కలెక్షన్స్ పై మన శంకర వరప్రసాద్ గారు ప్రభావం చూపిస్తాడేమో అనే మాటలు కూడా సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి.

2,809 Views

You may also like

Leave a Comment