09.01.2026 సాయంత్రం 9:50 గంటలకు ఖమ్మంలో ప్రమీల అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో హత్య చేశారు. మృతురాలి తమ్ముడు రామకృష్ణ ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా 12.01.2026 మధ్యాహ్నం టాటా షోరూం వద్ద వాహన తనిఖీల్లో ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. డబ్బుల లావాదేవీలు, వ్యక్తిగత విభేదాలే హత్యకు కారణమని నిందితులు అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకల బట్టలు, మృతురాలి ఐడీ కార్డు, స్మార్ట్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన ఖమ్మం వన్ టౌన్ పోలీస్ సిబ్బందిని ఏసీపీ ఖమ్మం అభినందించారు.