
.webp)
-తెలుగు సినిమా అభిమానులు ఏమంటున్నారు
– సంక్రాంతి చిత్రాల రిపోర్ట్ ఏంటి!
-బాక్స్ ఆఫీస్ కళకళలాడుతుందా
-ఇంతకీ ఆ ఒక్కటి ఏంటి
తెలుగు సినిమా అభిమానులు నిత్యం జపించే మంత్రం తెలుగు సినిమా గెలవాలని. ఈ సంక్రాంతి ఐదు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడంతో వాళ్ళల్లో ఒకింత టెన్షన్ కూడా వచ్చింది. సంక్రాంతి పోటాపోటీల్లో ముందుగా హిట్ టాక్ వచ్చిన సినిమాకి, ఆ తర్వాత వచ్చిన సినిమాకి కంపేర్ చేస్తు నెగిటివ్ టాక్ తెస్తారేమో అనేదే వాళ్ళ ప్రధాన టెన్షన్. కానీ సంక్రాంతి సినిమాలపై ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు తెలుగు సినిమా అభిమానుల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. వాటి వివరాలేంటో చూద్దాం.
ఈ సంక్రాంతికి రాజాసాబ్(The Rajasaab)తర్వాత వరుసగా మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)భర్త మహాశయులకు ఆహ్వానం(Bhartha Mahasayulaku wignapthi)అనగనగ ఒక రాజు(Anaganaga Oka Raju), నారీనారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari) మరింత సంక్రాంతిగా వెదజల్లడానికి వచ్చాయి. ఈ సినిమాలని వీక్షించిన ప్రేక్షకులు మాట్లాడుతున్న నాలుగు చిత్రాలు చాలా బాగున్నాయి. పైగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రదర్శించి థియేటర్స్ లో నవ్వుల జడివాన కురిపిస్తున్నాయి. తెలుగు సినిమాకి మంచి రోజులు వచ్చాయనేలా ఈ సారి హీరో, హీరోయిన్స్ దగ్గరనుంచి అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంపాక్ట్ చూపించాయి.
ఒక మూవీకి మరో మూవీకి పోలిక కూడా లేకుండా సంక్రాంతి కి పర్ఫెక్ట్ విందు దొరికినట్లయింది. నాలుగు కూడా హిట్. కలెక్షన్స్ పరంగా కూడా మంచి వసూళ్ళని రానుంది. ప్రతి సంక్రాంతి ఇదే విధంగా వీనుల విందు లాంటి మరిన్ని సినిమాలు వచ్చి విజయాన్ని అందుకోవాలి. రాజా సాబ్ ఈ విషయంలో కొంచం వెనకపడిందని ప్రేక్షకులు అంటున్నారు. దీంతో తెలుగు సినిమా అభిమానులు నూతనోత్సాహంతో సంబరాల్లో మునిగిపోయారు. పూర్తి రన్నింగ్ లో ఆయా చిత్రాలన్నీ సాధించే కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లో రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు.