గ్రీన్ అంబాసిడర్ల ఆకలి కేకలు పట్టించుకోని పంచాయతీ సిబ్బంది
పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్న పంచాయతీ సిబ్బంది
VRM న్యూస్ బాల మౌలాలి జనవరి 19
భారతదేశంలోనే రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట మండలంలో గత పది దినముల నుండి బస్టాండ్ సర్కిల్లో కోదండ రామయ్య గుడికి వెనక ప్రాంతంలో మరియు బజార్ వీధుల్లో ఒంటిమిట్ట లోని ప్రతి వీధిలోనూ చెత్తతో నిండిపోయింది. పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి పది రోజులపాటు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గ్రీన్ అంబాసిడర్లిచే పని చేయించుకుని జీతాలు ఇస్తామంటూ ఇవ్వకుండా సంక్రాంతి పండుగనాడు గ్రీన్ అంబాసిడర్లు ఫోన్ చేస్తే వారి ఫోన్లు కూడా సమాధానం ఇవ్వడం లేదు అని వాపోయారు. ఇది ఏమిటి అని పంచాయతీ కి సంబంధించిన గ్రీన్ అంబాజిటర్లను ప్రజలు అడుగుగా మాకు గత మూడు నెలల నుండి మాకు జీతభత్యాలు లేవు అందుకని మేము చెత్తను శుభ్రం చేయడము లేదు అని సమాధానం ఇచ్చారు. గ్రీన్ అంబాసిడర్ అరుణ విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఒంటిమిట్ట సచివాలయ కార్యదర్శి సుధాకర్ ఉన్నంతవరకు మాకు జీతాలు సక్రమంగా ఇచ్చే వారిని ఒకవేళ మా జీతాలు లేట్ అయినా సరే ఆయన సొంత డబ్బులు మాకు ఇచ్చేవారు ఇప్పుడు మా ఆకలి కేకలు పట్టించుకునే నాధుడే లేడు అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird