Home ఎంటర్‌టెయిన్మెంట్ రెహ్మాన్ పై జాలి చూపించవద్దు.. ఇవిగో సాక్ష్యాలు – VRM MEDIA

రెహ్మాన్ పై జాలి చూపించవద్దు.. ఇవిగో సాక్ష్యాలు – VRM MEDIA

by VRM Media
0 comments
రెహ్మాన్ పై జాలి చూపించవద్దు.. ఇవిగో సాక్ష్యాలు




-ట్విట్టర్ ఏం చెప్తుంది
-బంగ్లాదేశ్ రచయిత్రి ఆంతర్యం ఏంటి
-అసలు మ్యాటర్ ఇదేనా!

భారతీయ చిత్ర పరిశ్రమకి గర్వకారణంగా నిలిచిన మెషిన్ ‘ఏ ఆర్ రెహ్మాన్'(Ar Rehman)ఇటీవల సంగీతం మాట్లాడే అవకాశాలలో బాలీవుడ్‌లో మతపరమైన వివక్ష ఉందేమో అనే అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై రెహ్మాన్ వివరణ కూడా ఇచ్చాడు. ఇక ఈ ఎంటైర్ విషయం మొత్తంపై రచయిత్రి తస్లిమా నస్రీన్(తస్లీమా నస్రీన్) సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించింది.

ఎక్స్ వేదికగా రెహ్మాన్ విషయంపై నస్రిన్ స్పందిస్తూ ‘రెహ్మాన్ భారత్ లో చాలా పేరు పొందిన వ్యక్తి. నాకు తెలిసి రెమ్యునరేషన్ పరంగా అందరి మ్యూజిక్ డైరెక్టర్స్ కంటే ఎక్కువ. మతపరమైన కారణాలతో పని దొరకడం లేదని ఆయన చెప్పారు. కానీ తెలియాల్సిన విషయం ఏంటంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, జావేద్ ఖాన్ లాగానే రెహ్మాన్ సూపర్ స్టార్. పని విషయంలో వీళ్ళకి మతం అనేది దరిదాపుల్లోకి కూడా రాదు. నాలాంటి పేదలకే కష్టాలు ఉంటాయి. కాబట్టి రెహ్మాన్ ని చూసి ఎవరు జాలిపడవద్దు అని ట్వీట్ చేసింది.

ఇది కూడా చదవండి: లెజండ్రీ హీరోయిన్ చావుకి బ్లాక్ మ్యాజిక్ కారణమా! ఆమె భర్త ఏం చెప్పాడు

బంగ్లాదేశ్ కి చెందిన నస్రీన్ రచయిత్రి గా తన పుస్తకాలతో ఎంతో మందిని ఉత్తేజపరుస్తుంది. ప్రపంచ మహిళా హక్కుల కోసం పోరాడుతూ ఉండటంతో పాటు పక్కా సెక్యులర్ వాది. ఈ విషయంలో ఆమెపై ఎన్నోసార్లు దాడి జరిగినా కూడా తన ఆలోచనల్ని, భావాలని చెప్పే విషయంలో ఎలాంటి బెరుకు లేకుండా ముందుకెళ్తుంది.

2,810 Views

You may also like

Leave a Comment