ఆవిష్కరణ కార్యమంలో పాల్గొన్న సీనియర్ న్యాయవాదులు
లీగల్, ఖమ్మం: సామాన్యులకు ఉచిత న్యాయ సలహాలు అందిస్తూ, న్యాయ సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలన్న లక్ష్యంతో ఆవిర్భవించిన న్యాయనేత్రం సంస్థ, దైనందిన జీవితంలో న్యాయవాదులకు ఉపయోగపడే తొలి క్యాలెండర్ను రూపొందించుకుంది. ఈ కేలండర్ను జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శుల మరియు బార్ కౌన్సిల్ మెంబర్, సీనియర్ న్యాయవాదుల సమక్షంలో జిల్లా జడ్జి జి. రాజగోపాల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. తిధులు, పంచాంగం లేకుండా కేవలం పని దినాలు, సెలవు దినాలు, సివిల్ వెకేషన్స్ సమాచారం మాత్రమే ఇందులో ప్రతిబింబించేలా కేలండర్ను రూపొందించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ప్రథాన న్యాయాధికారి జి. రాజగోపాల్ న్యాయనేత్రం సంస్థ గురించి అడిగి తెలుసుకున్నారు. న్యాయనేత్రం పబ్లికేషన్ నుంచి రానున్న పుస్తకాలు, యూట్యూబ్ ఛానల్, మరియు న్యాయనేత్రం వెబ్సైట్ ద్వారా న్యాయసంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇటు న్యాయవాద వృత్తిలో ఉన్న వారితో బాటు సామాన్య ప్రజలకు కూడా అందిస్తున్నట్టు న్యాయనేత్రం చైర్మన్ అయితగాని జనార్ధన్ తెలిపారు. సంస్థ మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని కార్యక్రమానికి హాజరైన సీనియర్ న్యాయవాదులు ఆకాంక్షించారు. న్యాయనేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కోర్టు ముఖ్య పాలనాధికారి సంజయ్ షెట్కర్, ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షులు తొండపు వెంకటేశ్వర్ రావు, కార్యదర్శి గద్దల దిలీప్, స్పోర్ట్స్ సెక్రటరీ కె.వి.వి లక్ష్మి, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ బాధ్యులు ఓరుగంటి శేషగిరి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర బాధ్యులు పొట్లపల్లి విప్లవ కుమార్, సీనియర్ న్యాయవాదులు రావుల వెంకట్, అంబేడ్కర్, శ్రీనాథ్, న్యాయనేత్రం బాధ్యులు కోటేరు స్పందన రెడ్డి, బాసిపొంగు కవిత, ధర్మసోత్ ప్రమీల, అయితగాని, అక్షరలు పాల్గొన్నారు.

