[ad_1]

ప్రముఖ నటుడు అల్లరి నరేష్(Allari Naresh) ఇంట విషాదం చోటు చేసుకుంది. నరేష్ తాతయ్య, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఈరోజు(మంగళవారం) తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు.
ఈదర వెంకట్రావు సతీమణి వెంకటరత్నం 2019 మే 27న మరణించారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమారై. పెద్దకుమారుడు ఈవీవీ సత్యనారాయణ, రెండో కుమారుడు ఈవీవీ గిరి, మూడో కుమారుడు ఈవీవీ శ్రీనివాస్, కుమారై ముళ్ళపూడి మంగాయమ్మ.
రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో 50కి పైగా సినిమాలు చేసి గొప్ప దర్శకులలో ఒకరిగా పేరుపొందిన ఈవీవీ సత్యనారాయణ.. అనారోగ్యంతో 2011 జనవరి 21న కన్నుమూశారు. ఆయన కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ నటులుగా మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా అల్లరి నరేష్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకంగా సంపాదించుకున్నారు.
ఈదర వెంకట్రావు మృతితో అల్లరి నరేష్ ఇంట విషాదం. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడిలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు వెంకట్రావు అంత్యక్రియలు జరుగుతున్నాయి.

[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird