అన్నసమారాధన కార్యక్రమానికి లక్ష 25 వేలు రూపాయలు విరాళం
తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ గ్రామం శ్రీరంగపట్నం వెళ్లే రహదారిలోని దేవుని కొన్నేరు వద్ద ఉన్న శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.
తొలిత ఆయనకు కమిటీ సభ్యులు తీన్మార్ డప్పులతో, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు.
అలయంలో అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి తీర్థప్రసాదాలు భక్తులకు వడ్డీంచి స్వీకరించారు…
ఈ అన్నసమారాధన కార్యక్రమానికి లక్ష 25 వేలు రూపాయలు విరాళం ప్రకటించారు…
ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..