

VRM మీడియా న్యూస్ – సత్తుపల్లి ప్రతినిధి
పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా
తేదీ: 23-01-2026
పెనుబల్లి మండలంలోని వెబ్ & ఎలక్ట్రానిక్ మీడియా, వివిధ చానళ్లలో పనిచేస్తున్న రిపోర్టర్లు వృత్తి పరమైన ఐక్యత కోసం, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుట లక్ష్యంగా "పెనుబల్లి మండల వెబ్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్" ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు నాగబాత్తిని క్రాంతికుమార్ మాట్లాడుతూ, పెనుబల్లి మండల పరిధిలోని ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రెస్ క్లబ్ సభ్యులందరం ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.
అలాగే మండలంలో అధికారికంగా జరిగే కార్యక్రమాల వివరాలు మీడియాకు తెలియజేసి సహకరించాలని వివిధ శాఖల అధికారులను కోరుతూ, క్లబ్ సభ్యులందరూ కలిసి లెటర్ హెడ్ ప్యాడ్స్ అందజేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird