VRM న్యూస్ బాల మౌలాలి జనవరి 25
స్థానిక ఒంటిమిట్ట మండల కేంద్రంలోని ఏకశిలా నగరం నందు శ్రీ మాతంగ మహాపీఠం ఆధ్వర్యంలో రథసప్తమి పురస్కరించుకొని శ్రీ కోదండ రామస్వామి ఆలయ సమీపము ఉన్న రామతీర్థ లక్ష్మణ తీర్థ దగ్గర నుండి శ్రీశ్రీ మాతాంగ మహాపీఠం పీఠాధిపతులు శ్రీ మాతంగానందగిరి స్వాముల వారు భక్తులను రామ లక్ష్మణ తీర్థాలలో శ్రీ సూర్య భగన్నారాయణ మంత్రముతో ఆర్క పత్రములతో సర్వరోగ నివారణ కోసం భక్తులకు అనుస్టనం చేసి ఆశీర్వాదం ఇచ్చినారు. అక్కడ నుంచి భక్తులతో నగర సంకీర్తన చేసుకుంటూ ఏకశిలా నగరంలోని కళా వీధిలో స్వయంభు గా దర్శనమిస్తున్న శ్రీ శ్రీ ఆది జాంబవంతుని మూలవిరాట్ దగ్గర విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పురవీధుల నుండి నగర సంకీర్తనతో వచ్చి శ్రీ కోదండ రామస్వామి కి భక్తాగ్రేశ్వరులైనటువంటి భక్త మాల ఓబన్న మంటపము దగ్గర పూలమాలవేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం శ్రీ కోదండ రామస్వామి దేవాలయ ప్రధాన అర్చకులవారు శ్రీ రాఘవాచార్యులు పూర్ణకుంభంతో ఆహ్వానించి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత స్వాములవారి దర్శనం చేసుకున్నారు
ఈ కార్యక్రమంలో శ్రీ మాతంగ మహాపీఠం మేనేజర్ కే నాగభూషణం గొల్లపల్లి గురవయ్య అరవింద లీలా కృష్ణా యానాది గంగిరెడ్డి శివరాజ్ కుమార్ తదిత భక్తులు పాల్గొన్నారు.

