Home Uncategorized ఒంటిమిట్ట చెరువు చేపల వేటకు ఎస్సీ, ఎస్టి, బీసీలకు అనుమతులు ఇవ్వాలి

ఒంటిమిట్ట చెరువు చేపల వేటకు ఎస్సీ, ఎస్టి, బీసీలకు అనుమతులు ఇవ్వాలి

by VRM Media
0 comments

  • మండల దళిత సంఘం నాయకుడు కత్తి చంద్ర VRM న్యూస్ బాల మౌలాలి జనవరి 25

ఒంటిమిట్ట: మండల కేంద్రంలోని ఒంటిమిట్ట చెరువులో చేపల వేటకు ఎస్సీ, ఎస్టి, బీసీలకు కూడా అనుమతులు ఇవ్వాలని మత్స్యశాఖ అధికారులను మండల దళిత సంఘం నాయకుడు కత్తి చంద్ర డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒంటిమిట్ట పంచాయతీలో దాదాపు 300 కుటుంబాలు ఉన్న ఎస్సీ, ఎస్టి బీసీ కుటుంబాలకు భూములు, గుట్టలతో ఎలాంటి వ్యవసాయ జీవనోపాధి కూడా లేదన్నారు. అలాంటివారికి ప్రస్తుతం ఉన్న ఒంటిమిట్ట చెరువు మత్స్య సంఘంలో చేపల వేటకు అనుమతులు ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పడాలని మత్స్యశాఖ అధికారులను ఆయన కోరారు. గత కొన్ని దశాబ్దాలుగా కొన్ని కుటుంబాలు మాత్రమే మత్స్య సంఘంలో అనుమతులు పొంది ఒంటిమిట్ట చెరువులో చేపల పై జీవనోపాధి పొందుతున్నారని, ఈసారి ఉపాధి లేక చేపల వేట చేత వచ్చిన అనుమతులు లేక చేయని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఉన్న మత్స్య సంఘంలో చేపల వేటలో నైపుణ్యం ఉన్నవారి పేర్లను నూతనంగా నమోదు చేసి, అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు. కొన్ని దశాబ్దాలుగా ప్రస్తుతం ఒంటిమిట్ట మత్స్య సంఘంలో ఉన్నవారితో పాటు చేపల వేటలో నైపుణ్య నుండి ఆర్థికంగా వెనుకబడి ఉన్నఒంటిమిట్ట పంచాయతీలోని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆ సంఘంలో జత చేయాలని ఆయన మచ్చ శాఖ అధికారులను డిమాండ్ చేశారు.

2,812 Views

You may also like

Leave a Comment