జాతీయ జెండా ను ఆవిష్కరించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్
ముఖ్య అతిథులుగా పాల్గొన్న టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు
ఖమ్మం, జనవరి 26 :
స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఖమ్మం ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో జరిగిన,
ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దేశ గౌరవానికి ప్రతీక అయిన మువ్వన్నెల జెండాను ఆయన ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ వేడుకలకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్ – హెచ్ 2843) ఖమ్మం జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి నానాబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నాగేష్, టిబిజేఏ జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్త మరియు జిల్లా వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్స్ జిల్లా అధ్యక్షులు అమర బోయిన ఉపేందర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని, పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన మీడియా పాత్ర అత్యంత కీలకమని, సమాజంలోని సమస్యలను నిబద్ధతతో వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమం అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. చివరగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ కార్యక్రమానికి హాజరైన అతిథులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయడంతో వేడుకలు ఘనంగా ముగిశాయి.
ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి కుంభం రవికుమార్,
టీ.బీ.జే.ఏ జిల్లా కోశాధికారి శ్రీధర్, పట్టణ అధ్యక్షులు ఎలుగోటి వెంకట్, పట్టణ ఉపాధ్యక్షులు షేక్ సొందుమియా, కార్యదర్శి నాయిని స్వాతి, సహాయ కార్యదర్శి చిన్నంశెట్టి రాంబాబు, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గౌరవరపు జగదీష్, దునక శ్రీను, ప్రసాద రావు, సహాయ కార్యదర్శి కరాటే వేణు, మొగలి నాగేశ్వరరావు, తానంగి బిక్షం, ఈ.సి రాంబాబు, పాగా యోనా మరియు ఫెడరేషన్ నాయకులు సుదగాని కరుణాకర్, కుమార్, కప్పల మధు, కళ్లేపల్లి లింగయ్య, నలమాస్ మహేష్, కె.నాగకృష్ణ, వి.నరేష్, పి.సంతోష్ కుమార్, టి.రామక్రిష్ణ, కె.నాగరాజు, సి.హెచ్. పూర్ణ చందర్, అల్లావుద్దీన్, మధు బంక, ఎల్.రామ్మూర్తి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird