VRM న్యూస్ బాల మౌలాలి జనవరి 29
భారతదేశంలోనే రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో
భీష్మ ఏకాదశి సందర్భంగా గురువారం నాడు ఒంటిమిట్ట కోదండ రామస్వామి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలోని మూల విరాట్ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తుల కు పట్టు వస్త్రాలు. బంగారు ఆభరణాలు తొడిగి తులసి గజ మాలలతో సుందరంగా అలంకరించి వైభవంగా గ్రామోత్సవం ఇందులో అడుగడుగునా భక్తులు స్వామివారికి కయా కర్పూరం సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ టిటిడి ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ అర్చకులు. శ్రావణ్ కుమార్. రాఘవచార్యులు. పవన్ కుమార్ టిటిడి విజిలెన్స్ సిబ్బంది ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird