Home ఎంటర్‌టెయిన్మెంట్ బిగ్ సర్ ప్రైజ్.. అప్పుడే ఓటీలోకి ‘నారీ నారీ నడుమ మురారి’ – VRM MEDIA

బిగ్ సర్ ప్రైజ్.. అప్పుడే ఓటీలోకి ‘నారీ నారీ నడుమ మురారి’ – VRM MEDIA

by VRM Media
0 comments
బిగ్ సర్ ప్రైజ్.. అప్పుడే ఓటీలోకి 'నారీ నారీ నడుమ మురారి'



ఇటీవల కాలంలో హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా మెజారిటీ సినిమాలు మూడు, నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. ఇప్పుడదే బాటలో ‘నారీ నారీ నడుమ మురారి’ పయనిస్తోంది. (నారీ నారీ నడుమ మురారి)

2026 సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాలలో ‘నారీ నారీ నడుమ మురారి’ ఒకటి. శర్వానంద్ హీరోగా ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్.. జనవరి 14 సాయంత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ చిత్రం.. మంచి వసూళ్లతో సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ పలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అలాంటిది సడెన్ గా ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయడానికి ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు.

‘నారీ నారీ నడుమ మురారి’ ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ ఫిబ్రవరి 4 నుండి స్ట్రీమింగ్ చేయవలసి ఉంది. అంటే థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీలోకి వస్తోంది. ఒక సూపర్ హిట్ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగానే ఓటీటీలో అడుగుపెడుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఇది కూడా చదవండి: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ రివ్యూ

2,808 Views

You may also like

Leave a Comment