Home Uncategorized ఎముకలు కొరికే చలిలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

ఎముకలు కొరికే చలిలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

by VRM Media
0 comments

ఒంటిమిట్ట టిడిపి మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి

VRM న్యూస్ బాల మౌలాలి జనవరి 31

ఒంటిమిట్ట మండలం
పెన్నపేరూరు పంచాయతీ లో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్న ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి,.
పెన్నపేరూరు లో పింఛన్ల కార్యక్రమం గురించి అధ్యక్షులు మాట్లాడుతూ ఒక్కరోజు ముందే పేదలకి ఇచ్చే పింఛన్ల కార్యక్రమం ఎంతో అమోఘం అని, పేదల అవసరాలు తీర్చుకునేందుకు వీలుగా మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందించే ఈ కార్యక్రమం ఎన్నడూ జరగలేదని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ B. లక్ష్మీనరసయ్య సీనియర్ నాయకులు G. శ్రీనివాసులు రెడ్డి, యూనిట్ ఇంచార్జి K. చంద్రపాల్, రామయ్య లక్షుమయ్య, సంటెయ్య వెంకటసుబ్బయ్య, అయ్యావారయ్య, రాజన్న, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

2,807 Views

You may also like

Leave a Comment