Home ట్రెండింగ్ 8నెలలు ట్రైనింగ్, పరీక్షలలో గోల్డ్ మెడల్ సాధించిన శునకం.. నేడు డ్యూటీలో చేరిక | వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో చేరిన పోలీసు కుక్కలు, భైరవుడు మరియు విరాట్ శిక్షణలో బంగారు పతకం సాధించాడు – VRM MEDIA

8నెలలు ట్రైనింగ్, పరీక్షలలో గోల్డ్ మెడల్ సాధించిన శునకం.. నేడు డ్యూటీలో చేరిక | వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో చేరిన పోలీసు కుక్కలు, భైరవుడు మరియు విరాట్ శిక్షణలో బంగారు పతకం సాధించాడు – VRM MEDIA

by VRM Media
0 comments
8నెలలు ట్రైనింగ్, పరీక్షలలో గోల్డ్ మెడల్ సాధించిన శునకం.. నేడు డ్యూటీలో చేరిక | వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో చేరిన పోలీసు కుక్కలు, భైరవుడు మరియు విరాట్ శిక్షణలో బంగారు పతకం సాధించాడు


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

నేర పరిశోధనలో పోలీస్ జాగిలాల పాత్ర అత్యంత కీలకమైనది. కొన్ని చాలా క్లిష్టమైన క్రిమినల్ కేసులలో నిందితులను పట్టుకోవటంలో పోలీస్ జాగిలాల పాత్ర కొనియాడదగినది. అటువంటి పోలీస్ జాగిలాల పాత్ర నేరాల పరిశోధనలో చాలా కీలకమని వరంగల్ పోలీస్ కమీషనరేట్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

విధుల్లో చేరిన ట్రైనింగ్ పూర్తి చేసుకున్న జాగిలాలు

మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఎనిమిది నెలలపాటు ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న బీగల్ జాతికి చెందిన ‘భైరవ్’, ‘విరాట్’ అనే రెండు జాగిలాలు తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో విధుల్లో చేరాయి. ఈ సందర్భంగా స్వయంగా కమిషనర్ వారి సామర్థ్యాలను పరిశీలించి అవి ట్రైన్ అయినందుకు అభినందించారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో చేరిన పోలీసు కుక్కలు భైరవ్, విరాట్ శిక్షణలో బంగారు పతకం సాధించారు

మెడల్ అలంకరించి జాగిలానికి అభినందనలు

జాగిలాల హ్యాండ్లర్లు కుమారస్వామి (భైరవ్ హ్యాండ్లర్), సాంబయ్య (విరాట్ హ్యాండ్లర్)లను వారి శిక్షణ, పనితీరు, గుర్తింపు సామర్థ్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కాలంలో నిర్వహించిన క్లిష్ట పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించిన భైరవ్‌కు కమిషనర్ ప్రత్యేకంగా మెడ అలంకరించి హ్యాండ్లర్‌ను అభినందించారు.

ఆ కుక్కల ప్రత్యేకత చెప్పిన పోలీస్ కమీషనర్

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ నూతన జాగిలాలు పేలుడు పదార్థాలను అత్యంత వేగంగా, కచ్చితంగా పసిగట్టగలవని తెలిపారు. చిన్న ఆకారంలో కనిపించే పెద్ద జాగిలాలు చేరలేని ప్రదేశాలు, మార్గాలు, వాహనాల క్రింద భాగాలు, విమానాల్లో ప్రయాణికుల సామాన భద్రపరిచే కేబిన్‌ల వంటి ప్రాంతాలకు సులభంగా ప్రవేశించి తనిఖీలు చేయగలగడం వీటి ప్రత్యేకత అని వివరించారు.

పోలీస్ జాగిలాల సాయంతోనే నిందితుల గుర్తింపు

ముఖ్యంగా బాంబ్ డిటెక్షన్, మత్తు పదార్థాల గుర్తింపులో ఇవి విశేషంగా ఉపయోగపడతాయని చెప్పారు. గతంలో కూడా వరంగల్ పోలీస్ కమిషనరేట్ జరిగిన అనేక కేసుల్లో పోలీస్ జాగిలాల సహాయంతో నిందితులను గుర్తించామని చెప్పారు. ఈ జాగిలాల వల్లే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం సాధ్యమైందని కమిషనర్. నేరాలలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నియంత్రణ శునకాల సేవ వలన మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి.

ఇటీవల బ్రోనో పదవీ విరమణ

ఇదిలా ఉంటే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12 సంవత్సరాల పాటు సేవలు అందించిన బ్రోనో అనే ట్రాకర్ డాగ్‌కు ఇటీవల ఘనంగా వీడ్కోలు పలికారు.ట్రాకర్ జాగిలింగా గుర్తింపు పొందిన బ్రోనో అనే జాగిలం 12 సంవత్సరాల క్రితం వరంగల్ కమిషనరేట్‌లో విధుల్లో చేరింది. కీలకమైన వీఐపీల భద్రతలో సేవలు అందించిన బ్రోనో, నేర పరిశోధనలలో పోలీసులకు అత్యంత కీలకమైన సేవలందించింది.

వరంగల్ కమీషనరేట్ కు రెండు జాగిలాలు

వరంగల్ కమిషనర్ లో 15 క్లిష్టమైన కేసులను ఛేదించి నిందితులను గుర్తించడంలో సహాయపడింది. ఇటీవలే రిటైర్ అయ్యింది. ఇప్పుడు మరో రెండు కొత్త జాగిలాలు ట్రైన్ అయ్యి వరంగల్ కమీషనరేట్ కు వచ్చాయి. అందులో గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటిన భైరవ్ ఉంది.

2,801 Views

You may also like

Leave a Comment