

-అభిమానుల ముఖాల్లో ఆనందం
-వైభవంగా జరుగుతున్న వివాహం
-స్పెషల్ అండ్ హైలెట్స్ ఏంటి!
ప్రస్తుతం రష్మిక(Rashmika Mandanna),విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)అభిమానుల ముఖాలు చూడాలి. దీపావళి ఈ సంవత్సరం కొంచం ముందుగానే వచ్చిందా అనిపిస్తుంది. అంతలా వాళ్ళ ముఖాలు వెలిగిపోతున్నాయి. దీన్ని బట్టి ఆ పెళ్లి ఘనంగా జరిగిందనే కదా ఇద్దరి విషయం అర్ధమవుతుంది. అవును. అభిమానుల నోటి నుంచి సుదీర్ఘ కాలం నుంచి వస్తున్న వాక్కు కి తధాస్తు దేవతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రోజు ఉదయం పదిగంటల నిముషాలకి రాజస్థాన్ లోని ఉదయపూర్(ఉదయ్ పూర్)లో ఘనంగా జరిగింది. మరి పెళ్లి లో హైలెట్స్ ని ఒకసారి చూద్దాం.
ITC మెమెంటోస్ లో హిందూ సాంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వేడుకకి పెళ్ళికి ఇరువైపుల ఉన్న అతి ముఖ్యమైన బంధువులు మాత్రమే సూచన. ఇద్దరు ధరించిన పెళ్లి వస్త్రాలు ప్రత్యేక డిజైన్లతో ధగధగా మెరిసిపోయాయి. కరెక్ట్ గా ఉదయం 10 గంటల 10 నిమిషాలకి రష్మిక మెడలో విజయ్ తాళి కట్టాడు. ఆ క్షణంలో విజయ్, రష్మిక ఇద్దరూ ఎమోషనల్ అయ్యారని వాళ్ళని ఆ విధంగా చూసి ఆశ్చర్యపడినట్టుగా తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్రన్, శివ నిర్వాణ, ఈషా రెబ్బా, ఆషిక రంగనాథ్, స్టైలిస్ట్ శ్రావ్య వర్మ ఇలా సినీ ఇండస్ట్రీతో పాటు సుమారు 100 మంది క్లోజ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అటెండ్ అయ్యారు.
ఇది కూడా చదవండి: నాగార్జున: భారతీయ సినిమా ప్రయాణంలో ఘట్టం స్టార్ట్
విందులో తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, కర్ణాటక స్పెషల్ బిసిబేళా బాత్‌తో పాటు కొడవ సంప్రదాయంలో ప్రత్యేకమైన పోర్క్ కర్రీలతో విందు భోజనం ఏర్పాటు చేసినట్లు సమాచారం.సాయింత్రం 4.30 కి ముందుగా అనుకున్న ప్రకారం రెండో సారి వివాహం జరగనుంది.