- పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలన్న జడ్పిటిసి
బిల్లులు మంజూరు కాలేదనిసర్పచులఆవేదన
తమ హయాంలో జరగని పనులకు నిధులు మంజూరు చేయలేం
ఒంటిమిట్టVRM న్యూస్ బాల మౌలాలి 25
ఒంటిమిట్ట: మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ అక్కి లక్ష్మీదేవి అధ్యక్షతన ఎంపీడీవో సుజాతమ్మ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జడ్పిటిసి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో ఉన్న 17 ప్రభుత్వ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పరిష్కరించాల్సిన సమస్యలను ఆయా శాఖల మండల కార్యాలయాల అధికారులతో చర్చించడం జరిగింది. అయితే పలు శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చర్చ వచ్చినప్పుడల్లా పలువురు ప్రజాప్రతినిధులు వారి సమస్యలను అధికారులకు చెప్పుకొచ్చారు. అందులో ముఖ్యంగా…
పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోండి
ఎంపీడీవో కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సెలవు పై వెళ్లిన చింతరాజుపల్లి పంచాయతీ కార్యదర్శి చైతన్య పై చర్యలు తీసుకోవాలని ఒంటిమిట్ట జడ్పిటిసి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి మండల సమావేశంలో అధికారులను కోరారు. దీనికి ఎంపీడీవో స్పందిస్తూ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సెలవు పై వెళ్లిన కార్యదర్శి చైతన్య పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు.
చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయండి
కొండమాచపల్లి, సాలాబాదు పంచాయతీలలో సర్పంచులు మేరువ శివ నారాయణ, స్వర్ణలత చేసిన పనులకు బిల్లులు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు మంజూరు కాకపోతే తదుపరి చేయాల్సిన పనులకు తమకు ఎక్కడి నుంచి నిధులు సమకూర్తాయని ప్రశ్నించారు.
మా హయాంలో జరగని పనులకు బిల్లులు మంజూరు చేయలేంతమ హయాంలో జరగని పనులకు మేము బిల్లులు మంజూరు చేయలేమని సర్పంచ్ అడిగిన ప్రశ్నలకు ఎంపీడీవో సుజాతమ్మ, డిప్యూటీ ఎంపీడీవో చలపతి సమాధానం ఇచ్చారు. మా హయాంలో జరగని పనులకు మేము బిల్లులు మంజూరు చేస్తే, భవిష్యత్తులో మేము బిల్లులు మంజూరు చేసిన పనుల్లో అవకతవకలు జరిగి ఉంటే వాటి వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు.
చెరువు కాలువలను పునరుద్ధరణ చేయండి
కంప చెట్లు, పిచ్చి మొక్కలతో నిండిన ఒంటిమిట్ట చెరువు కాలువలను పునరుద్ధరణ చేసి రైతులకు చెరువు నీరును అందించాలని ఒంటిమిట్ట చెరువు వైస్ ప్రెసిడెంట్ యానాదయ్య ఉపాధి ఏపీవోను కోరారు. దీనికి రెండు రోజుల్లో చెరువు కాలువ పనులను ప్రారంభిస్తామని ఏపీఓ శివ శంకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
నిధులు కేటాయిస్తే చెరువు కట్టపై ముళ్ళ చెట్లను తొలగిస్తాం
ఒంటిమిట్ట చెరువు కట్ట పొడవున ఉన్న ముళ్ళ చెట్లను తొలగించి బ్రహ్మోత్సవాలకు శుభ్రంగా ఉంచాలని ఒంటిమిట్ట జల వనరుల శాఖ ఏఈ కిషోర్ ను పలువురు కోరగా టీటీడీ నిధులు కేటాయిస్తే తప్పక తొలగించి శుభ్రం చేస్తామని ఏఈ తెలిపారు.
క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించండి
క్యాన్సర్ వ్యాధుల పట్ల కొండ మాచుపల్లి ప్రజలకు అవగాహన కల్పించాలని సర్పంచ్ మెరువ శివ నారాయణ మండల వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ భావనను కోరారు. వ్యాధుల పట్ల ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తామని డాక్టర్ భావన సర్పంచ్ కోరిక మేరకు సమాధానం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు, ఎంపీటీసీలు పిడుగు రామలక్ష్మమ్మ, సుంకేసుల భాష, సర్పంచులు మేరువ శివ నారాయణ, స్వర్ణలత, కత్తి సుజాత పాల్గొన్నారు.
