[ad_1]

ఏదైనా సాంగ్ విడుదలైనప్పుడు కాపీ ఆరోపణలు రావడం సహజం. ఎక్కువగా ట్యూన్ కాపీ కొట్టారనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే, డ్యాన్స్ స్టెప్ కాపీ అనే ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు 'ఆయా షేర్' సాంగ్.. అలాంటి ఆరోపణలనే ఎదుర్కొంటోంది.
'దసరా' తరువాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందించిన మూవీ 'ది ప్యారడైజ్'(ది ప్యారడైజ్). అనిరుధ్ సంగీతం అందించింది. ఈ సినిమా నుంచి తాజాగా 'ఆ షేర్' అనే సాంగ్ విడుదలైంది. సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రసుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఇందులో నాని సిగరెట్ వెలిగిస్తూ వేసిన హుక్ స్టెప్ కూడా వైరల్ గా మారింది. అదే సమయంలో ఈ స్టెప్ పై కాపీ అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. (ఆయా షేర్ సాంగ్)
2021లో తాను వేసిన స్టెప్ ని కాపీ చేసి 'ఆయా షేర్'లో పెట్టారని బాబా జాక్సన్ అనే డ్యాన్సర్ ఆరోపిస్తున్నాడు. రాజస్థాన్ కి చెందిన బాబా జాక్సన్ అసలు పేరు యువరాజ్ సింగ్. మైకేల్ జాక్సన్ కి వీరాభిమైన యువరాజ్.. తన పేరుని బాబా జాక్సన్ గా మార్చుకున్నాడు. (బాబా జాక్సన్)

సోషల్ మీడియాలో తనదైన డ్యాన్స్ స్టెప్పులతో మంచి పేరు సంపాదించుకున్నాడు బాబా జాక్సన్. పలువురు బాలీవుడ్ స్టార్స్ సైతం అతని డ్యాన్స్ కి ఫిదా అయ్యారు. అలాంటి బాబా జాక్సన్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ నానిని టార్గెట్ చేశాడు. తాను గతంలో వేసిన స్టెప్ ని కాపీ కొట్టారంటూ 'ది ప్యారడైజ్' టీమ్ పై ఆరోపణలు చేశారు. దీనితో ఇప్పుడు సౌత్ లోనూ అతని పేరు మారుమోగుతోంది.
'ఆయా షేర్' హుక్ స్టెప్.. నిజంగానే బాబా జాక్సన్ స్టెప్ ని కాపీ కొట్టినట్టుగా ఉందని కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. డ్యాన్స్ స్టెప్పులు ఒక దానిని పోలి మరొకటి ఉండటం సహజమని, అంతమాత్రాన కాపీ అంటూ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.
కాగా, ఈ 'ఆయా షేర్' సాంగ్ కి సుధన్ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఈ కాపీ ఆరోపణలపై ఆయన ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి.
ఇది కూడా చదవండి: థియేటర్లలో విష్ణు, మహేష్ ల విన్యాసం.. ఓటీటీలో అదిరిపోయే సినిమాలు, సిరీస్ లు!
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird