[ad_1]

-లిటిల్ హార్ట్లతో యూత్ హార్ట్స్లో స్టే చేస్తున్న శివాని
-ఇప్పుడు హే బలవంత్ తో థియేటర్స్ లో సందడి
-వెంకటేశ్వర స్వామి దర్శనంపై తను ఏం మాట్లాడింది
-అసలు ఎందుకు మాట్లాడవలసి వస్తుంది
శివాని నగరం(Shivani Nagaram)..తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ కి దొరికిన అచ్చ తెలుగు నటి. ఫస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నుంచి రీసెంట్ గా వచ్చిన 'హే బల్వంత్' (హే బల్వంత్) వరకు శివాని ప్రదర్శించే పెర్ఫార్మ్ కి ఆమె అసలు పేరు మర్చిపోయి ఈ సినిమాలోని క్యారక్టర్స్ పేరుతో పిలుస్తుంటాం. అంతలా తన సెటిల్డ్ పెర్ఫార్మ్ తో మెస్మరైజ్ చేస్తుంది. రీసెంట్ గా ఈ అమ్మడు కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి(Tirumala Tirupati Sri venkateswara Swami)విషయంలో తనపై వస్తున్న కొన్ని విమర్శలకి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయమేంటో చూద్దాం.
శివాని నగరం ఇటీవల హే బలవంత్ ప్రమోషన్స్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'తిరుమలలో 15 నిమిషాల పాటు స్వామివారి దర్శనం కలిగిందనే విషయాన్నీ వెల్లడి చేసింది. శివాని అలా చెప్పిందో లేదో నిమిషాల్లోనే ఆ మాట వైరల్ గా మారడంతో పాటు సెలబ్రిటీలకు టీటీడీ పెద్దపీట వేస్తోందని నెటిజన్స్ విమర్శనాస్త్రాలు గుప్పిస్తు కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసారు. ఇలా విమర్శలు చేస్తున్న వాళ్ళకి దర్శనంపై తన పూర్తి ఆంతర్యం అర్ధం కావాలని శివాని తాజాగా ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతుంది మా అమ్మ,నేను 10500 రూపాయిల శ్రీవాణి దర్శనం టిక్కెట్లు తీసుకొని దర్శనానికి వెళ్ళాం. లైన్లో వెళ్తున్నపుడు స్వామి వారిని కొంచెం చూస్తూ వెళ్తాం కదా. ఆ విధంగా కనిపించే మొత్తం సమయం కలిపి 15 నిమిషాలు అయ్యింది. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎగ్జైట్మెంట్ తో అందరితో షేర్ చేసుకున్నాను. అంతేకానీ స్వామి ముందు గర్భాలయంలో నన్ను ఎవరు 15 నిమిషాల పాటు ఉంచలేదు. మీలో కూడా ఎవరైనా సరే శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకొని వెళ్తే కచ్చితంగా స్వామివారి దర్శనం చాలా మంచిగా జరుగుతుంది. మీరు కూడా నేను పొందిన అనుభూతినే పొందుతారని శివాని చెప్పుకొచ్చింది. శ్రీవాణి దర్శనం టికెట్ ని కూడా ఆమె చూపించడం విశేషం.
ఇది కూడా చదవండి:Pawan kalyan: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి చేదు అనుభవం.. ఎవరి నుంచో తెలిస్తే షాక్ అవుతారు
దీంతో విమర్శలు చేసే వాళ్ళు శివాని ఇచ్చిన క్లారిటీ పై సంతృప్తి చెందడం ఖాయం. ప్రస్తుతం తన నుంచి కొత్త చిత్రం ప్రకటన రాకపోయినా పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తుంది.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird