Home Uncategorized రోడ్డు భద్రతపై అవగాహనతోనే ప్రమాదాల నివారణ సాధ్యం : ఏసీపీ వసుంధర యాదవ్

రోడ్డు భద్రతపై అవగాహనతోనే ప్రమాదాల నివారణ సాధ్యం : ఏసీపీ వసుంధర యాదవ్

by VRM Media
0 comments

VRM మీడియా న్యూస్
సత్తుపల్లి ప్రతినిధి
ఖమ్మజిల్లా
27/2/26

రోడ్డు భద్రతపై అవగాహనతోనే ప్రమాదాల నివారణ సాధ్యం : ఏసీపీ వసుంధర యాదవ్

కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన లేకపోవడమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని అన్నారు. వీఆర్కే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం రెండో దశలో వాహనదారులు, ఆటో డ్రైవర్లు, ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్‌లు మరియు సీట్‌బెల్టులు ధరించకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించినప్పుడే ప్రమాదాలను తగ్గించవచ్చని స్పష్టం చేశారు.

డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించిన ఆమె, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. “సేఫ్ జర్నీ – హ్యాపీ డెస్టినేషన్” లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

2,802 Views

You may also like

Leave a Comment