VRM media ప్రతినిధి అయినవిల్లి భద్రం
పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి విజయ భాస్కర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
రేపు ఒకటో తారీకు ఆదివారం కావడంతో, లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో 28వ తారీఖునే ముందస్తుగా పెన్షన్ పంపిణీ నిర్వహించారు. దేవీపట్నం మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారికి పెన్షన్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు మారిశెట్ల వెంకటేశ్వరరావు, కొత్తపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, ప్రభుత్వంపై కృతజ్ఞతలు తెలిపారు.
పెన్షన్ భరోసా పథకం ద్వారా పేదల జీవితాల్లో ఆర్థిక భద్రత పెరుగుతోందని, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు.
