Home ఎంటర్‌టెయిన్మెంట్ మీనాక్షి చౌదరి దశ తిరిగింది.. ఇక హీరోయిన్‌గా రేంజ్ పెరిగినట్టే! – VRM MEDIA

మీనాక్షి చౌదరి దశ తిరిగింది.. ఇక హీరోయిన్‌గా రేంజ్ పెరిగినట్టే! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


సినిమా రంగంలో హీరోలతో ప్రస్తుతం హీరోయిన్ల స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే పాతతరం హీరోయిన్లు మాత్రం కొన్ని దశాబ్దాలపాటు తమ హవా కొనసాగిస్తున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి లేదు. 10 సంవత్సరాలకు మించి ఎవరూ హీరోయిన్‌గా కొనసాగే పరిస్థితి లేదు. ఆ సిత్యుయేషన్‌లో కూడా త్రిష, నయనతార వంటి హీరోయిన్లు రెండు దశాబ్దాలు దాటినా హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. ఇటీవలికాలంలో ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు. కొన్ని సినిమాలలో తమ గ్లామర్‌ని, పెర్‌ఫార్మెన్స్‌ని చూపించి తెరమరుగైపోయారు.

దీపం చక్కబెట్టుకోవాలి అంటే సామెత హీరోయిన్ల విషయంలో బాగానే ఉంది. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న హీరోయిన్లు ప్రతి కొనుగోలు చేస్తూ ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. 2019లో ‘అప్‌స్టార్ట్స్‌’ అనే హిందీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది. ఆ తర్వాత మరో అవకాశం రాలేదు. 2021లో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఫస్ట్ మూవీతో మంచి మార్కులు కొట్టేసిన మీనాక్షికి తెలుగు, తమిళ భాషల్లో వరస అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్‌లో చాలా తక్కువ టాప్ హీరోయిన్ అనిపించుకుంది. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఈ ఏడాది ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలతో విజయాలు అందుకున్నారు. మొదట హిందీ చిత్రంతోనే పరిచయమైన మీనాక్షికి ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ సరసన హీరోయిన్‌గా నటించబోతోంది.

20 సంవత్సరాల క్రితం ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ‘భాగమ్ భాగ్’ చిత్రం ఒక ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్‌కు రాజ్ శాండిల్య దర్శకత్వం వహించబోతున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన ఈ సినిమాలో మీనాక్షితోపాటు ‘దురంధర్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న అయేషా ఖాన్ మరో హీరోయిన్‌గా ఎంపికైంది. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన ‘వృషకర్మ’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది మీనాక్షి. సౌత్‌లో టాప్ హీరోలందరి సరసన నటిస్తున్న మీనాక్షి ఇప్పుడు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం ఆమెకు బాగా ప్లస్ అవుతుంది.

2,801 Views

You may also like

Leave a Comment