

-విరోష్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే
-ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన నూతన జంట
-రణబాలి నుంచి సాంగ్ రిలీజ్
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna)ఈ నెల 26న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అంగరంగ వైభవంగా జరిగిన వారి పెళ్లి వేడుక గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా కొత్త జంటకి శుభాకాంక్షలు చెబుతూ విజయ్, రష్మిక ల అప్ కమింగ్ మూవీ ‘రణబాలి”(రణబాలి)టీమ్ బ్యూటిఫుల్ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీలో విజయ్ రణబాలిగా, జయమ్మగా రష్మిక కనిపించనున్నారు. ఎద్దు బండి సవారీలో నూతన వధూవరులను తీసుకురావడం, అత్తవారింట్లో నవ వధువు శుభప్రదంగా అడుగుపెట్టడం..ఇవన్నీ ఎంతో అందంగా ఈ పాటలో రూపొందించారు.
ఈ పాట ఎలా ఉందో చూస్తే .. ఏందయ్యా సామీ, ఇంత కాస్తాందీ వెన్నెల, ఊపేస్తావుంది సిత్తరాల ఉయ్యాలా, వీచే గాలికి అత్తరద్దిందెవ్వరు, మారే ఝాముకి మందుపెట్టిందెవ్వరు, మాయదారి మనస్సాగక జాగరామన్నారా…’ అంటూ సాగుతుందీ పాట. మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్ – అతుల్ బ్యూటీఫుల్ గా కంపోజ్ చేశారు.
కూడా చదవండి: ఉదయభాను: ఉదయభాను ఫ్రమ్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: స్టే ట్యూన్
రాహుల్ సంకృత్యన్(రాహుల్ సాంకృత్యాయన్)దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టేజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. “రణబలి” సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రణబాలి” రూపొందుతోంది.