- టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో ఎం.రవిచంద్ర
- మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వరకు ఉత్సవాలు
- ఏప్రిల్ 1న స్వామివారి కళ్యాణం, 2న రథోత్సవం.
VRM న్యూస్ ఒంటిమిట్ట బాల మౌలాలి: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఉన్నతాధికారులకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉత్సవాల సమాచారానికి సంబంధించి కర, ఆహ్వన, గోడపత్రాలను తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.ర విచంద్రతో కలిసి బోర్డు మీటింగ్ అనంతరం ఆవిష్కరించారు. మార్చి 26న ఉదయం వ్యాసాభిషేకం, దీక్షా తిరుమంజనం పూజలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేస్తారు. 27న ఉదయం 9:30 నుంచి ధ్వజారోహణం సాయంత్రం 4 నుంచి పోతన జయంతి, కవి సమ్మేళనం కార్యక్రమాలు జరుగుతాయి. పగలు, రాత్రి వాహన సేవలు ఉంటాయి. గ్రామ పురవీధుల్లో స్వామి ఊరేగింపు ఉంటుంది. రెండు పూటలా సాంస్కృతిక సంబంరం మనోహరంగా సాగేలా కార్యాచరణను సిధం చేశారు. ఏప్రిల్ 1న సాయంత్రం 3:15 నుంచి 5 గంటల వరకు కాంత కోరిక ఎదుర్కోలు ఉత్సవం వేడుకగా జరగనుంది. సాయత్రం 6:30 నుంచి 8:30 గంటలకు జానకిరాములు పరిణయ ఘట్టం కనులపండువగా నిర్వహిస్తారు. 2న రథోత్సవం, 4న ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం, 5న పుష్పయాగంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఆవిష్కరణ అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద మాట్లాడుతూ ఈ సారి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాములోరి వివాహా మహోత్సవాన్ని తిలకించేందుకు వేలాది భక్తులు, వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు తరలిరానున్నారన్నారు. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి.వీరబ్రహ్మం, డాక్టర్ ఎ.శరత్, సీవీఎస్ వో మురళికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
