VRM MEDIA ప్రతినిధి ఖమ్మం


పరామర్శించిన టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మరియు ఖమ్మం జిల్లా కార్యదర్శి నాన బాల రామకృష్ణ, జిల్లా కోశాధికారి ఆర్వపల్లినగేష్
భరోసాను కల్పించిన టి.డబ్ల్యూ.జె.ఎఫ్ హెచ్-2843 నాయకత్వం సభ్యులు
గత నెల 28 వ తారీఖున సిద్దిపేట జిల్లా, చిన్న కోడూరు రహదారిపై జరిగిన కారు యాక్సిడెంట్ లో, టీబీజేఎ ఖమ్మం జిల్లా అధ్యక్షులు సామ్రాట్ గుప్తా తనయుడు తర్షిత్ తేజ కు, తొడ బొక్క విరిగి అత్యవసర సర్జరీ జరిగింది. సర్జరీ అనంతరం రాష్ట్ర వ్యవస్థాపకులు కన్వీనర్ మామిడి సోమయ్య మరియు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నగేష్, టీబీజేఏ నగర అధ్యక్షులు వి.ఆర్.ఎం ఛానల్ వెంకట్, హైదరాబాద్ నాగోల్ లోనీ పవన్ సాయి ఆర్థోపెడిక్ హాస్పిటల్ లో తర్షిత్ తేజను పరామర్శించడం జరిగింది.
మామిడి సోమయ్య మరియు ఖమ్మం నుండి వచ్చిన జిల్లా నాయకులు, ఆపరేషన్ చేసిన డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ నీ సంప్రదించి, ఆపరేషన్ జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ విజయవంతం చేయటానికి తాము ఎంతో శ్రమపడినాము అని డాక్టర్ తెలిపారు. డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ కి టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు.
మామిడి సోమయ్య మాట్లాడుతూ, భవిష్యత్తులో మన యూనియన్ సభ్యులకు ఎవరికైనా అనుకోని సంఘటనలు జరిగిన ఎడల ఇప్పుడు తర్షిత్ తేజకు ఏ విధంగా అయితే ఆర్థికంగా మనోధైర్యాన్ని కల్పించామో,
అదే విధంగా ప్రతి యూనియన్ సభ్యునికి అండగా ఉంటామని వారు భరోసాను కల్పించారు. తర్షిత్ తేజ త్వరగా కోలుకోవాలని యధావిధిగా మళ్లీ తిరిగి పాఠశాలకు వెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఇదే సమయంలో ఆపదలో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యుడు సామ్రాట్ గుప్తా కుటుంబానికి ఆర్థికంగా, మన యూనియన్ తరుపున సహకారం అందించిన సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.