VRM మీడియా న్యూస్ | సత్తుపల్లి ప్రతినిధి
లంకసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ DMHO డా. బి. చందు నాయక్ గారు, డిప్యూటీ DMHO & ఇమ్యూనైజేషన్ PO ప్రదీప్ కుమార్ గారు హాజరై, గవర్నమెంట్ డెలివరీలు, తల్లి–బిడ్డ సంరక్షణ సేవలపై ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
NCD స్క్రీనింగ్‌లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి కలెక్టర్ అవార్డు సాధించిన లంకసాగర్ PHC సిబ్బందిని అభినందించారు. సబ్ సెంటర్ల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ CHO పోలమ్మ దంపతులు PHCకు మైక్–స్పీకర్‌ను డొనేషన్‌గా అందజేశారు. వారి సేవాభావాన్ని అడిషనల్ DMHO ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా. కిరణ్ కుమార్, DPHN అరుణదేవి, PHN సుగుణదేవి, హెల్త్ సూపర్వైజర్ నాగేశ్వరావు, సిబ్బంది, ANMs, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరవేయాలని సూచించారు.
– డా. కిరణ్ కుమార్ చింతా
మెడికల్ ఆఫీసర్, లంకసాగర్ PHC

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird