Home ఎంటర్‌టెయిన్మెంట్ రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ రావడంపై పవన్ కళ్యాణ్ కామెంట్స్! – VRM MEDIA

రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ రావడంపై పవన్ కళ్యాణ్ కామెంట్స్! – VRM MEDIA

by VRM Media
0 comments
రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ రావడంపై పవన్ కళ్యాణ్ కామెంట్స్!



ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్)కి పద్మశ్రీ వరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్)ని మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మశ్రీ అవార్డుకు తన పేరును సిఫార్సు చేయడంలో కీలక పాత్ర పోషించి, తనకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కి రాజేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ని ఆత్మీయంగా హత్తుకుని, ఘనంగా సత్కరించారు పవన్ కళ్యాణ్. పద్మశ్రీ వంటి గొప్ప గౌరవం దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.

తనకెంతో ఇష్టమైన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కి పద్మ పురస్కారం రావడం పట్ల పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. “మీరు సినిమాల్లో పండించే హాస్యం, చూపించే నటన ఎంతోమందికి స్ఫూర్తి. ఈ పురస్కారం మీకు ఎప్పుడో రావాల్సింది, ఇప్పటికైనా సరైన గుర్తింపు దక్కడం సంతోషంగా ఉంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: మార్చి 26న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!

2,807 Views

You may also like

Leave a Comment