Home Uncategorized శుభ వేడుకలో పాల్గొన్న టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్–2843) జిల్లా నాయకులు

శుభ వేడుకలో పాల్గొన్న టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్–2843) జిల్లా నాయకులు

by VRM Media
0 comments

VRM MEDIA ప్రతినిధి ఖమ్మం

ఖమ్మం, ఫిబ్రవరి 04

టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్–2843) ఖమ్మం జిల్లా నాయకులు స్థానికంగా నిర్వహించిన ఓ శుభ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిల్లా ఉపాధ్యక్షులు కందరబోయిన నాగకృష్ణ అక్క కంభం శ్రీదేవి, బావ కంభం రాము నివాసంలో మేనల్లుడు శ్రీనివాస్‌, మేనకోడలు ఝావేరి ల పంచెకట్టు–ఓణీల శుభ కార్యక్రమానికి జిల్లా నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించిన నాయకులు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి శుభ సందర్భాలు కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయని, ఆనందాన్ని పరస్పరం పంచుకునే అవకాశం కల్పిస్తాయని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి, జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, జిల్లా కోశాధికారి అర్వపల్లి నగేష్, టీబీజేఏ ఖమ్మం నగర అధ్యక్షులు ఎలుగోటి వెంకట్, నగర కోశాధికారి కప్పల మధు, వనం నరేష్, పొదిలపు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

2,809 Views

You may also like

Leave a Comment