Home Uncategorized ఎమ్మెల్యే చొరవతో ముగిసిన తెలుగు తమ్ముళ్ల వివాదాలు*

ఎమ్మెల్యే చొరవతో ముగిసిన తెలుగు తమ్ముళ్ల వివాదాలు*

by VRM Media
0 comments

VRM media ప్రతినిధి అయినవిల్లి భద్రం

పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్ల మధ్య తలెత్తిన అంతర్గత వివాదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి చొరవ తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

పార్టీ సీనియర్ నాయకులను కార్యాలయానికి పిలిపించి వారితో ప్రత్యేకంగా చర్చలు నిర్వహించిన ఎమ్మెల్యే, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేలా బుజ్జగించారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకూ, నాయకుడికీ సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే హామీతో సీనియర్ నాయకులు శాంతించడంతో, పార్టీలో నెలకొన్న వివాదాలు తాత్కాలికంగా ముగిశాయి. పార్టీ ఐక్యతను కాపాడుకోవాలని, కలిసి పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే సూచించారు.

2,806 Views

You may also like

Leave a Comment