Home Uncategorized గత ప్రభుత్వం లో తిరుమల లడ్డు లో కల్తీ నెయ్యి వాడకంపై తుమ్మలపల్లి రమేష్ ప్రెస్ మీట్

గత ప్రభుత్వం లో తిరుమల లడ్డు లో కల్తీ నెయ్యి వాడకంపై తుమ్మలపల్లి రమేష్ ప్రెస్ మీట్

by VRM Media
0 comments

VRM media ప్రతినిధి అయినవిల్లి భద్రం

పవిత్ర తిరుమల లడ్డు లో కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసారని జగన్ రెడ్డి పై మండి పడిన తుమ్మలపల్లి రమేష్

కాకినాడ జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి 05:

గత వైసిపి ప్రభుత్వం లో అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకమైన స్కామ్లు చేసి కోట్ల రూపాయలు దోచేశారన్నారు..

అంతటితో ఆగకుండా హిందువుల పవిత్ర దైవమైన తిరుమల శ్రీవారి లడ్డును సైతం కల్తీ నెయ్యి ద్వారా అవినీతికి పాల్పడ్డాడని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ ఆరోపించారు..

గురువారం జగ్గంపేటలోని కాపు కళ్యాణమండపం నందు తుమ్మలపల్లి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీట్ నివేదికలో కెమికల్ యాసిడ్ శ్రీవారి లడ్డులో వాడినట్లు నివేదికలు వచ్చిన సరే వైసీపీ ప్రభుత్వం ఇంకా తామేమి తప్పు చేయలేదంటూ బు కాయిస్తుందన్నారు…

దమ్ముంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, అప్పటి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అండ్ వైసీపీ బ్యాచ్ కి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న తిరుపతి లడ్డులో మేము ఏ విధమైన అవినీతి, కల్తీకి పాల్పడలేదని ఆ దేవునిపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు…

క్రైస్తవ మతస్థుడైన జగన్మోహన్ రెడ్డి అన్ని మతాలను గౌరవించవలసిన బాధ్యత తనపై ఉందని హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా వ్యవహరించడం సరికాదని తుమ్మలపల్లి రమేష్ అన్నారు.. ఈ కార్యక్రమంలో జనసేన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిసే రామకృష్ణ, జగ్గంపేట టౌన్ అధ్యక్షులు గవర సుధాకర్, కిర్లంపూడి మండల అధ్యక్షులు గంధం ప్రభాకర్, గండేపల్లి మండల అధ్యక్షుడు గోన శివ, రామవరం ఎంపీటీసీ దొడ్డా శ్రీను, తామరాడ ఎంపీటీసీ గోకేడ రాజా, తిరుమలాయపాలెం ఎంపీటీసీ చక్రారావు, మాదారపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, సత్తి సోమరాజు,కాయల మణికంఠ, గోకేడ ప్రసాద్,పల్లా ప్రసాద్, మల్లేపల్లి రాజు, పాలెం బాబి,గోకేడ పండు, దూది శ్రీనివాస్, నేడూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు

2,811 Views

You may also like

Leave a Comment