3000 ఉద్యోగాల కల్పనే లక్ష్యం
VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం *రాజానగరం హై స్కూల్ నందు ఈ నెల 8 ఆదివారం వికాస, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో జరగబోయే మెగా జాబ్ మేళా ఏర్పాట్లను పర్యవేక్షించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ జాబ్ మేళా కు వచ్చే యువతీ యువకులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. ఈ జాబ్ మేళా మునుపెన్నడూ లేని విధంగా 60 మల్టీ నేషనల్ కంపెనీల ద్వారా 3000 మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు. రాజానగరం నియోజకవర్గం మరియు పరిసర ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ఈ జాబ్ మేళాలో ఐటి, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఫార్మసీ, సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ , టీచింగ్, నర్సింగ్, హోటల్ మేనేజ్మెంట్ , మార్కెటింగ్, సేల్స్, డ్రైవర్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలియజేసారు.
వీరితో పాటు వికాస మరియు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ అధికారులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird