తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట పేట నియోజకవర్గం, గోకవరం మండలం రంప యర్రంపాలెం గ్రామం,గంగభవాని నగర్ లోని శ్రీశ్రీశ్రీ దేవి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.
తొలిత కంబాల యువసేన అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం ఆధ్వర్యంలో యువత బైక్ ర్యాలీలతో, బాణాసంచ కాల్పులు, తీన్మార్ డప్పులతో, పూల వర్షం కురిపిస్తూ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు ఘన స్వాగతం పలికారు.
అలయంలో అమ్మవారిని దర్శించుకుని, పూజలు నిర్వహించారు. మహిళలు చేపట్టిన బోనాలు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
వార్షికోత్సవ కార్యక్రమానికి 50 వేలు రూపాయలు, అన్న సమారాధన కార్యక్రమానికి 20 బస్తాలు బియ్యం విరాళం అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కంబాల శ్రీనివాసరావు ని శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించి, మెమొంటో అందజేశారు.