Home ఎంటర్‌టెయిన్మెంట్ భారీ బడ్జెట్ మైథలాజికల్ ఫిల్మ్ లో ఇద్దరు స్టార్స్! – VRM MEDIA

భారీ బడ్జెట్ మైథలాజికల్ ఫిల్మ్ లో ఇద్దరు స్టార్స్! – VRM MEDIA

by VRM Media
0 comments
భారీ బడ్జెట్ మైథలాజికల్ ఫిల్మ్ లో ఇద్దరు స్టార్స్!



జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు సుమంత్(సుమంత్). ‘అనగనగా’తో ఆకట్టుకున్న సుమంత్.. ప్రస్తుతం ‘మహేంద్రగిరి వారాహి'(మహేంద్రగిరి వారాహి) అనే సినిమా చేస్తున్నాడు. ఇది సుమంత్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.25 కోట్ల బడ్జెట్‌తో ప్రదర్శిస్తున్నట్లు.

రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణం ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌కు సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. ‘సుబ్రహ్మణ్యపురం’ తర్వాత సుమంత్-సంతోష్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘మహేంద్రగిరి వారాహి’కి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో ఇద్దరు స్టార్స్ అతిథి పాత్రల్లో మెరవనున్నారని సమాచారం. ఆ ఇద్దరు ఎవరో కాదు.. సిద్ధు జొన్నలగడ్డ, కీర్తి సురేష్.

‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ(సిద్ధు జొన్నలగడ్డ).. రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’లో గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘మహేంద్రగిరి వారాహి’లో కూడా ఏడు నిమిషాల పాటు ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

ఇక కీర్తి సురేష్(Keerthy Suresh)కి అతిథి పాత్రలు కొత్త కాదు. చివరగా ‘జాతి రత్నాలు’లో మెరిసింది. ‘మహేంద్రగిరి వారాహి’లోనూ ప్రత్యేక పాత్రలో సందడి చేయనుందట.

సుమంత్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’కి సిద్ధు జొన్నలగడ్డ, కీర్తి సురేష్ గెస్ట్ రోల్స్ ఏ మేరకు హెల్ప్ అవుతాయో చూడాలి.

ఇది కూడా చదవండి: మొదటిసారి వెబ్ సిరీస్ చేస్తున్న రవితేజ!

2,802 Views

You may also like

Leave a Comment