

-వైరల్ గా మారిన శ్రియ మాటలు
-25 ఏళ్ళు అయిన ఆ కోరిక తీరలేదు
-ఇంతకి తన కోరిక ఏంటి!
‘పాలకడలి’ ని చిలికినప్పుడు తను కూడా ఈ భూమి మీదకి వచ్చిందా అని శ్రీయ(Shriya)ని చూసినప్పుడు అనిపిస్తుంది. అంత సౌందర్యం శ్రీయ సొంతం. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న అందరి సూపర్ స్టార్స్ తో జోడి కట్టి నెంబర్ వన్ హీరోయిన్ అనే టాగ్ లైన్ ని పర్మినెంట్ హౌస్ అడ్రస్ గా మార్చుకుంది. కమర్షియల్ చిత్రాల్లోనే కాదు నటనకి మాత్రమే స్కోప్ ఉన్నచిత్రాల్లో కూడా అద్భుతమైన పెర్ఫార్మ్ ప్రదర్శించిన నటి.. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో తన పెర్ఫార్మ్‌లో ఉన్న సత్తా ఏ మాత్రం తగ్గలేదని గుర్తు చేస్తూ ‘మిరాయ్’ లో అంబికా ప్రజాపతి క్యారక్టర్ ద్వారా అందరు సినిమాలో లీనమయ్యేలా చేసింది. రీసెంట్ గా శ్రియ ఒక ఇంటర్వ్యూలో నాకు 25 సంవత్సరాలుగా తీరని కోరిక అని చెప్పి అభిమానులని షాక్ కి గురి చేసింది.
శ్రీయ మాట్లాడుతు నాట్య కళాకారిణి క్యారక్టర్ లో నటించాలనే కోరిక 25 ఏళ్లుగా ఉండిపోయింది. అందులో భాగంగా ఒక నాట్యకళాకారిణి జీవిత పయనాన్ని పూర్తి స్థాయిలో చూపించే సినిమాలో చేయాలనీ ఉంది. అందుకు సంబంధించిన నృత్యం అంటే నాకు ప్రాణం. ఎవరైనా అటువంటి క్యారక్టర్ ఇస్తారేమో అని నిరూపించాను.
ఇది కూడా చదవండి: ఊహించని దర్శకుడుతో బాలయ్య మూవీ
తమ అభిమాన నటి మనసులోని కోరిక తీరుతుందా లేదా అనేదే అభిమానుల షాక్ కి కారణం. 2001లో తెలుగు సినిమాతో రంగ ప్రవేశం చేసిన శ్రియ 2018లో ఆండ్రీ కోచీవ్ ని వివాహం చేసుకోగా ప్రస్తుతం ఆ ఇద్దరికీ ఒక పాప. ప్రస్తుతం హిందీలో ప్రదర్శిస్తున్న దృశ్యం 3 లో చేస్తుంది.