Home ఎంటర్‌టెయిన్మెంట్ ఒకే సినిమాలో ఏడుగురు హీరోయిన్లు.. టాలీవుడ్ డైరెక్టర్ అడ్వెంచర్! – VRM MEDIA

ఒకే సినిమాలో ఏడుగురు హీరోయిన్లు.. టాలీవుడ్ డైరెక్టర్ అడ్వెంచర్! – VRM MEDIA

by VRM Media
0 comments
ఒకే సినిమాలో ఏడుగురు హీరోయిన్లు.. టాలీవుడ్ డైరెక్టర్ అడ్వెంచర్!



ఒకే సినిమాలో ఒకరి కంటే ఎక్కువ మంది హీరోయిన్లు ఉంటే వారిని, వారి క్యారెక్టర్లను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. గతంలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉన్న సినిమాలు కూడా వచ్చాయి. ఆ సినిమాలను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత పెరగడం, దానికి తగ్గట్టుగానే వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. దానికి అనుగుణంగానే పారితోషికాలు కూడా పెరిగాయి. అలాంటి పరిస్థితుల్లో గతంలో ఒకరి కంటే ఎక్కువ హీరోయిన్లతో సినిమాలు చేయడం ఇప్పుడు సాధ్యమయ్యే విషయం కాదు. కానీ, డైరెక్టర్ క్రిష్ ఆ సాహసానికి శ్రీకారం చుట్టబోతున్నారని.

కమర్షియల్ పంథాలో వెళ్లడం కంటే కంటెంట్ ప్రధానంగా సినిమా చెయ్యాలని భావించే డైరెక్టర్ క్రిష్ ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమా కథలు విభిన్నంగా ఉండడమే కాకుండా కొన్ని సామాజిక అంశాల్లో కూడా స్ప ష్టంగా ఉన్నాయి. గమ్యం, వేదం, కంచె వంటి సినిమాలు ప్రేక్షకులకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యాయి. బలమైన కథ, సహజమైన పాత్రలు, సన్నివేశాలు.. క్రిష్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే గత ఏడాది అనుష్క ప్రధాన పాత్రలో రూపొందించిన ఘాటి చిత్రం మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.

ఘాటి చిత్రంపై తాను పెట్టుకున్న నమ్మకం వమ్ము కావడంతో తను చేయబోయే తదుపరి చిత్రంపై ప్రత్యేక దష్టి పెట్టారు క్రిష్. ఈసారి పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు తను చేసిన సినిమాలకు భిన్నంగా అడ్వెంచర్ జోనర్‌లో సినిమా చెయ్యాలని క్రిష్ కోరుకునే సమాచారం. ట్రెకింగ్ నేపథ్యంలో కథను సిద్ధం చేసుకుంటున్నారని. పర్వతాలు, ఫారెస్ట్, ప్రక తి అందాల నేపథ్యంలో ఈ కథ ఉంటుందట. రెగ్యులర్‌గా వచ్చే కమర్షియల్ ఫార్మాట్‌లో కాకుండా భిన్నమైన సినిమాగా ఇది ఉండబోతోంది.

ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ ఏడుగురు ఎవరు అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఎవరి పాత్రనూ తక్కువ చేయకుండా అందర్నీ హైలైట్ చేసే విధంగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నారు క్రిష్. అంత మంది హీరోయిన్లను బ్యాలెన్స్ చేస్తూ సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆయా పాత్రల డిజైనింగ్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారని అందుకే. ఎవరి క్యారెక్టర్‌ను తక్కువగా చూపించినా అది పెద్ద డిస్కషన్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమస్య రాకుండా స్క్రిప్ట్ దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు క్రిష్. ప్రస్తుతం హీరోయిన్లను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తయిన తర్వాత ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

2,801 Views

You may also like

Leave a Comment