Home ఎంటర్‌టెయిన్మెంట్ ప్రభాస్ కి గాయాలు! ఎందుకు అయ్యాయో తెలిస్తే షాక్ అవుతారు – VRM MEDIA

ప్రభాస్ కి గాయాలు! ఎందుకు అయ్యాయో తెలిస్తే షాక్ అవుతారు – VRM MEDIA

by VRM Media
0 comments
ప్రభాస్ కి గాయాలు! ఎందుకు అయ్యాయో తెలిస్తే షాక్ అవుతారు



-సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ప్రభాస్
-గాయాలు నిజమేనా!
-ఫ్యాన్స్ ఆందోళన
-అధికార ప్రకటన చేయాలని డిమాండ్

రాజా సాబ్ ఇచ్చిన పరాభవానికి గుణపాఠం నేర్పాలనే పట్టుదలతో ప్రభాస్ ఉన్నాడు. అందుకే తన అప్ కమింగ్ మూవీ ‘ఫౌజీ'(ఫౌజీ)ని శరవేగంగా పూర్తి చేసి అభిమానుల ముందు ఉంచాలనేది ప్రభాస్ ప్లాన్. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి(హను రాఘవపూడి)దర్శకత్వంలో పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతుంది. టీజర్ తో ఊహకి అందని విధంగా యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయనే మాటలో ఎవరికి డౌట్స్ లేవు. ఈ నేపథ్యంలోనే ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రభాస్ గాయాలు పాలయ్యాడనే న్యూస్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.

రీసెంట్ గా ప్రభాస్ తన క్యారక్టర్ కి సంబంధించి గుర్రపు స్వారీ చేస్తుంటే, అనుకోకుండా కింద పడ్డాడని, దీంతో ప్రభాస్ చేతికి గాయమైందనే వార్త ఒక రేంజ్ లోనే చక్కర్లు కొడుతుంది. చిత్ర బృందం మాత్రం అధికారకంగా వెల్లడి చెయ్యలేదు. కానీ సోషల్ మీడియాలో గాయం న్యూస్ వైరల్ గా మారడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై నిర్మాణ సంస్థ పూర్తి క్లారిటీని కోరుతోంది. మరి అభిమానుల ఆందోళనని పరిగణలోకి తీసుకొని గాయం విషయంపై ప్రకటన వస్తుందేమో చూడాలి.

కూడా చదవండి: హీరో నిఖిల్ కాంట్రవర్సీ కామెంట్స్.. ఎవరిని టార్గెట్ చేశాడు?

ప్రభాస్ సరసన ఇమాన్వి(ఇమాన్వి)జతకడుతుండగా మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. మిదున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్,జయప్రద, భానుచందర్ వంటి మేటి నటులు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. ప్రభాస్ సోల్జర్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. తన ఎన్టీఆర్ కెరీర్ లోనే ఫస్ట్ టైం సోల్జర్ రోల్ లో కనిపించాడు. ఆ క్యారక్టర్ లో మరో వేరియేషన్ కూడా ఉంటుందేమో చూడాలి. దసరా కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

2,801 Views

You may also like

Leave a Comment