

-రంభ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉన్నారా!
-నటన, డాన్స్ లతో పాన్ ఇండియాని సైతం రఫ్ఫాడించింది
-2010 తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు
-రీ ఎంట్రీ కి సిద్ధమవుతోందా!
-పూర్తి డీటెయిల్స్ చూద్దాం
రంభ(రంభ).. 90వ దశకంలో తెలుగు చిత్ర సీమని శాసించిన హీరోయిన్స్ లో తను కూడా ఒకరు. ఒక్క తెలుగులోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ చేసి ఆ రోజుల్లోనే పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందింది. అభిమానులైతే సాక్షాత్తు దేవలోకం నుంచి దిగి వచ్చిన రంభ గా ఫీలవుతారు. అంత అందంగా ఉండటమే కాదు అంతే అందమైన నటనని, డాన్స్ ని కనపర్చడం రంభ స్పెషాలిటీ. రీసెంట్ గా రంభ గురించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
సిల్వర్ స్క్రీన్ పై రంభ చివరిగా కనిపించిన మూవీ ‘పెన్ సింగం’. తమిళంలో తెరకెక్కగా 2010 రిలీజ్ డేట్. ఆ తర్వాత రంభ మరో చిత్రం చేయలేదు. అంటే ఆమె సెల్యులాయిడ్ పై మెరిసి 16 సంవత్సరాలు. చాలా మంది మేకర్స్ ఆఫర్స్ చేసినా ఆమె నో చెప్పినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె ముఖానికి మేకప్ వేసుకోవడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు కొంత మంది దర్శకులతో రంభ టచ్ లో ఉన్నట్టుగా సమాచారం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ న్యూస్ తో వెల్ కమ్ టూ పాన్ ఇండియా ఇండస్ట్రీ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తమ అభిమాన నటి ఎలాంటి రోల్స్ లో కనిపించనుందంటే క్యూరియాసిటీ కూడా వాళ్లందరిలో ఉంది. పనిలో పనిగా కొంత మంది అయితే పలానా రోల్స్ లో కనిపించమని సలహాలు ఇస్తున్నారు.
కూడా చదవండి: lokah chapter 2: కొత్త లోక చాప్టర్ 2 స్టార్ట్.. చంద్ర గా ఈ హీరోయిన్ ఓకేగా
విజయవాడ కి చెందిన రంభ 16 ఏళ్ళ వయసులో ఉళవన్ అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా తన సినీ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసింది. తెలుగులో ఆమె ఫస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు. తన మొదటి సినిమా నుంచే వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా చిరంజీవి, వెంకటేష్, రజనీకాంత్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోస్ తో జత కట్టింది. హిందీలో పదిహేను చిత్రాల వరకు చేసిన రంభ మరి రీ ఎంట్రీ లో ఏ మేర తన సత్తా చాటుతుందో చూడాలి.