

-సోషల్ మీడియాలో విశ్వక్ సేన్ గురించి సరికొత్త చర్చ
-గత ఏడాది లైలా ని గుర్తుకు తెస్తున్నారు
-అది సెంటిమెంట్ గా మారనుందా!
ఉదయం ఎనిమిది గంటల షో తో థియేటర్స్ దగ్గర అభిమాన సందడి కనిపించే స్థాయికి విశ్వక్ సేన్(విశ్వక్ సేన్)ఎదిగాడని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మంచి పెర్ ఫార్మర్ అనే పేరు కూడా ప్రేక్షకుల దగ్గర నుంచి వినిపిస్తుంది. కానీ వరుస పరాజయాలు విశ్వక్ సేన్ కి హాయ్ చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ కి సంబంధించిన ఒక ఆసక్తికర చర్చ నెత్తింట చక్కర్లు కొడుతోంది. ఆ ఆసక్తికర న్యూస్ ఏంటో చూద్దాం.
విశ్వక్ సేన్ ఈ నెల 13 న వాలైంటెన్స్ డే కానుకగా కామెడీ ఎంటర్ టైనర్ ‘ఫంకీ’(Funky)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. మొదటి షో కి పాజిటీవ్ టాక్ వచ్చింది. కానీ బంగాళాఖాతంలో వాయుగుండం పడి క్రమం క్రమంగా బలహీనపడినట్టుగా షోలు ప్రదర్శించే కొద్దీ ఫంకీ బలహీన పడుతూ వస్తుందనే టాక్ వినిపిస్తోంది. కలెక్షన్స్ సైతం కనీస హుషారు ని ప్రదర్శించడం లేదనేది ట్రేడ్ సర్కిల్స్ రిపోర్ట్. దీనితో పరాజయాన్ని డిక్లైర్ చేయవచ్చనే అభిప్రాయంలో సినీ మేధావులు ఉన్నారు. విశ్వక్ సేన్ ప్రీవియస్ మూవీ లైలా(laila). ఈ చిత్రం గత ఏడాది ఫిబ్రవరి 14 న సరిగ్గా వాలైంటెన్స్ డే రోజునే ల్యాండ్ అయ్యి డిజాస్టర్ ని అందుకుంది. దీంతో వాలైంటెన్స్ డే విశ్వక్ సేన్ కి కలిసి రాలేదనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.
కూడా చదవండి: మృణాల్ ఠాకూర్: ఆ హీరోని చూసి నా మాజీ ప్రియుడు భయపడ్డాడు.. తన వల్ల కాదన్నాడు
లైలా, ఫంకీ లో విశ్వక్ సేన్ పెర్ఫార్మ్ మాత్రం సూపర్ గా ఉంటుంది. యాక్టర్ గా ఫెయిల్ కాలేదనే చెప్పాలి. లైలా లో అయితే లేడీ గెటప్ లో ఎంతో కష్టపడి మెప్పించాడు. కాకపోతే అలాంటి చిత్రాలు గతంలో ప్రేక్షకుల ముందుకు చాలానే వచ్చాయని. కొత్త తనం లేకపోవడం వలనే ఆ రెండు చిత్రాలకి పరాజయం గ్రాండ్ వెల్ కమ్ చెప్పిందనేది సోషల్ మీడియాలో సినీ ప్రియులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.
.webp)