

-ఈ నెల 27న రిలీజ్ కి రెడీ అవుతున్న కేరళ స్టోరీ పార్ట్ 2
-విద్వేషపూరిత ప్రోపగాండా అంటూ మండి పడుతున్న సీఎం
– రిలీజ్ కి ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయా!
-మేకర్స్ ఏమంటున్నారు
‘ది కేరళ స్టోరీ'(The Kerala Story)సృష్టించిన సంచలన విజయం గురించి తెలుస్తుంది. విజయాన్ని బీట్ చేసే విధంగా వివాదాలు, విమర్శలని కూడా ఎదుర్కున్న రికార్డు కేరళ స్టోరీ సొంతం. ఈ నెల 27న పార్ట్ 2తో మరోసారి వరల్డ్ వైడ్ సెల్యు లాయిడ్ పై మెరవనుంది.ప్రచార చిత్రాలు చూస్తుంటే కథ, కథనం విషయంలో పార్ట్ 1 ని మించిన అంశాలు ఉండబోతున్నట్టుగా అర్ధమవుతుంది. రీసెంట్ గా పార్ట్ 2 పై కేరళ సిఎం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలతో మూవీ విషయంలో వాట్ నెక్స్ట్ అనే పరిస్థితి. మరి విజయన్ ఏం మాట్లాడారో చూద్దాం.
పినరయి విజయన్ మాట్లాడుతు కేరళ స్టోరీ మూవీ ‘విద్వేషపూరిత ప్రోపగాండా. కేరళ రాష్ట్రం అక్షరాస్యత, సామాజిక అభివృద్ధిలో దేశానికే ఆదర్శం.కానీ సినిమా ముసుగులో కేరళ ని ఉగ్రవాదానికి కేంద్రంగా ప్రపంచం ముందు తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చిన ‘లవ్ జిహాద్’ మళ్లీ తెరపైకి తీసుకురావడం మతపరమైన విభజనకు దారితీసే ప్రయత్నం. తప్పుడు సందేశాలు ఇచ్చే ఇలాంటి చిత్రాలను ప్రజలు తిరస్కరించాలి.శాంతియుత వాతావరణాన్ని చెడకొట్టడానికి కొన్నిశక్తులు ప్రయత్నించాయని విజయన్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: vishwak sen: వాలైంటెన్స్ డే ఎందుకు కలిసి రావడం లేదు
అయితే రీసెంట్ గా కేరళ స్టోరీ 2(ది కేరళ స్టోరీ 2) నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా మాట్లాడుతు కళాకారులకి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. ఎవరినీ లక్ష్యంగా చేసుకుని కేరళ స్టోరీ ని నిర్మించలేదు. సమాజంలో ఉన్న కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగానే ప్రదర్శించాం. సినిమాని పూర్తిగా చూసిన తర్వాత ఎవరైనా ఒక అభిప్రాయానికి రావచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో కేరళలో విడుదల పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా, అదితి భాటియా, అర్జన్, సుమిత్, రాజీవ్ కీలకమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు. కేరళ స్టోరీ 2023 లో రాగా ఆదా శర్మ ప్రధాన క్యారక్టర్ ని పోషించింది. సుదీప్తో సేన్ దర్శకుడు. ఇప్పుడు పార్ట్ 2 కి కామాఖ్యా నారాయణ్ సింగ్(Kamakhya Narayan Singh)దర్శకుడు.