Home Uncategorized షైన్ హై స్కూల్ లో ఘనంగా జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవ వేడుకలు

షైన్ హై స్కూల్ లో ఘనంగా జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవ వేడుకలు

by VRM Media
0 comments

VRM MEDIA ప్రతినిధి ఖమ్మం

ముఖ్య అతిధులుగా పాల్గొన్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బి పి నాయక్ ,వైరా ఏసీపీ సారంగపాణి , బోనకల్ సబ్ ఇన్స్పెక్టర్ పొదిలి వెంకన్న ….

బోనకల్ :: స్థానిక షైన్ హై స్కూల్ లో విజ్ఞాన దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి… 1వ తరగతి నుంచి 9 వ తరగతి వరకు విద్యార్థులు వివిధ సైన్స్ ప్రాజెక్ట్స్ తయారు చేసి అందరిని ఆశ్చర్య పరిచారు…వారి ప్రాజెక్ట్స్ గురించి వచ్చిన అతిధులకి క్లుప్తంగా వివరించారు… మొత్తం 60 ప్రాజెక్ట్స్ తయారు చేసారు… ఈ సందర్భంగా ఏసీపీ . సారంగపాణి మాట్లాడుతూ విద్యార్దులే దేశ ప్రగతికి ముఖ్యం అని, శాస్రవేత్తలుగా మారి దేశ పురోభివృద్ధికి తోడ్పాడాలని అన్నారు.యూత్ లీడర్ బి పి నాయక్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం లాంటి గొప్ప శాస్రవేత్తలు మన దేశం లో పుట్టారని, అలాంటి వ్యక్తులని ఆదర్శం గా తీసుకుని ముందుకు నడవాలని అన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ వెంకన్న మాట్లాడుతూ యువత ఎప్పుడు ప్రయత్నిస్తున్నే ఉండాలని, కష్టపడితే విజయం మనదే అని అన్నారు..
ఈ కార్యక్రమం లో పాఠశాల కరెస్పాండంట్ అన్సర్ పాషా, డైరెక్టర్ లాల్ మహమ్మద్, ప్రిన్సిపాల్ శ్వేత, అడ్మినిస్ట్రేషన్ నాగేశ్వరావు,విజ్ఞాన శాస్త్ర భోదకులు వెంకటేశ్వర్లు, వెంకట్, వాణి శైలజ, కవిత, రుక్సానా, ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.

2,803 Views

You may also like

Leave a Comment