VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం ప్రెస్ నోట్
28-02/2026
మండలంలో ఘనంగా ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల పంపిణీ
ఇందుకూరుపేటలో ముగ్గురు నూతన లబ్ధిదారులకు సౌజ్ పెన్షన్ అందజేసిన మండల అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు
దేవీపట్నం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి సూచనలతో దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. శనివారం మండల అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఒక రోజు ముందుగానే పెన్షన్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన ముగ్గురు నూతన లబ్ధిదారులకు సౌజ్ పెన్షన్లు మంజూరయ్యాయి.
- రౌతు వెంకటరత్నం
- కామిశెట్టి వెంకటలక్ష్మి
- రావిపాటి నాగరత్నం
ముగ్గురికి నూతన సౌజ్ పెన్షన్
గోళ్ళ చంటిబాబు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, ఎమ్మెల్యే శిరీష దేవి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఒక రోజు ముందుగానే పెన్షన్ అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ ముచ్చు వీరవెంకట సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు మాగపు బాబురావు, ప్రధాన కార్యదర్శి కీర్తి గంగరాజు, మాజీ మండల అధ్యక్షులు మరి శేట్ల వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు రేలంగి రాంబాబు, బూత్ ఇంచార్జి పుట్టపల్లి మల్లేశ్వరరావు, కొత్తపల్లి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి సురేష్, సచివాలయ సిబ్బంది , కార్యకర్తలు పాల్గొన్నారు.

