Home ఎంటర్‌టెయిన్మెంట్ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం.. విరోష్ పెళ్లి రిసెప్షన్ కి ఫ్యాన్స్ కి నో ఎంట్రీ! – VRM MEDIA

సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం.. విరోష్ పెళ్లి రిసెప్షన్ కి ఫ్యాన్స్ కి నో ఎంట్రీ! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్‌పూర్‌లో కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది.

మార్చి 4న హైదరాబాద్‌లో విజయ్-రష్మిక వివాహ వేడుక ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. (విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్)

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులను కలిసి తమ వివాహ రిసెప్షన్ కు హాజరు కావాలని రష్మిక ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సతీమణి.. రష్మికకు బొట్టు పెట్టి, నూతన వస్త్రాలను బహుకరించారు.

ఇదిలా ఉంటే ఆహ్వానం లేకుండా అభిమానులను విజయ్, రష్మిక అందించారు. ఈ మేరకు వారి బృందం కీలక ప్రకటన చేసింది.

“విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో గెస్ట్‌లు రిసెప్షన్‌లో పాల్గొంటారు. ఇన్విటేషన్ లేని వారు ఈ రిసెప్షన్‌కు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బృందం అందించింది.

?s=20

2,803 Views

You may also like

Leave a Comment