తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో జరిగిన శ్రీశ్రీశ్రీ మాసారమ్మ తల్లి, సత్తెమ్మ తల్లి, గంగమ్మ తల్లి మహా సంబరాలు కార్యక్రమంలో
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తొలిత ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.
జాతర మహోత్సవలకు కంబాల శ్రీనివాసరావు గారు 50 వేలు రూపాయలు విరాళం అందించారు. తప్పిడి గుళ్ళు బృందానికి 17 వేలు రూపాయలు అందించారు..
ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు..