Home Uncategorized పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో HPV వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం – ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్

పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో HPV వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం – ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్

by VRM Media
0 comments

v

VRM మీడియా న్యూస్
సత్తుపల్లి ప్రతినిధి
ఖమ్మం జిల్లా

09-03-2026 (సోమవారం): పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో లంకాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన HPV వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం 14 ఏళ్ల బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) టీకా ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే స్వయంగా బాలికలకు టీకా వేశారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, మండల నాయకులు, కార్యకర్తలు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

2,803 Views

You may also like

Leave a Comment