….
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు.
ఇఫ్తార్ విందుకు హాజరైన నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు
VR M న్యూస్ బాల మౌలాలి మార్చి 9
ఒంటిమిట్ట మండలం / నియోజకవర్గ కార్యాలయం
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు.
ఆదివారం నాడు ఒంటిమిట్ట మండలం,సాలాబాదు గ్రామం నందు పర్యటిస్తూ పార్టీ నాయకుడు సాలాబాదు బుజ్జి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు విచ్చేశారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ మాసం పవిత్ర మాసం అన్నారు.
అంతేకాకుండా రంజాన్ మాసంలో కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేపడతారని,మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని చమర్తి అన్నారు.
అదేవిధంగా ఇఫ్తార్ విందుతో సోదర భావం పెంపొంది,లౌకిక విలువలు కాపాడుతూ,ప్రజల మధ్య ఐక్యత భావం పెంచుతుందంటారు.చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయం అన్నారు.
అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని చమర్తి జగన్ మోహన్ రాజు గారు ఆకాంక్షించారు.
అనంతరం అక్కడే ప్రజా సౌకర్యార్థం త్రాగునీటి మరియు సాగునీటి అవసరాల నిమిత్తం నూతన బోరు వేయించగా నేడు మోటార్ను ప్రారంభించారు.
అంతకుముందు గ్రామంలో పర్యటించిన నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారికి భారీ గజమాలతో గ్రామ టిడిపి నాయకులు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట పెద్ద ఎత్తున ఒంటిమిట్ట సిద్ధవటం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ముస్లిం సోదరులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

